హైదరాబాద్లో 11 ఆహార సంస్థలపై TG SAFE చర్యలు.. పరిశుభ్రత లోపాలపై కఠిన చర్యలు
నగరంలోని ఆహార భద్రత ప్రమాణాల అమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, ఆహార సంస్థలను తనిఖీ చేసిన TG SAFE అధికారులు తీవ్రమైన లోపాలను గుర్తించారు.
TG Safe


హైదరాబాద్ , 27 సెప్టెంబర్ (హి.స.)నగరంలోని ఆహార భద్రత ప్రమాణాల అమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, ఆహార సంస్థలను తనిఖీ చేసిన TG SAFE అధికారులు తీవ్రమైన లోపాలను గుర్తించారు. తనిఖీల అనంతరం 11 రెస్టారెంట్ల ఫుడ్ సేఫ్టీ లైసెన్సులను సస్పెండ్ చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తనిఖీల్లో బొద్దింకలు, ఎలుకల మల అవశేషాలు, పాత ఆహార పదార్థాలు, సరైన నిల్వ విధానం లేకపోవడం, వంటగదుల్లో పరిశుభ్రత లోపాలు వంటి సమస్యలను అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ సంస్థల్లో పనిచేసే వేలాది మంది ప్రతిరోజూ రెస్టారెంట్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. వంటగదుల్లో ముడి పదార్థాలను ఎలా నిల్వ చేస్తున్నారు, వండిన ఆహారాన్ని ఎలా సంరక్షిస్తున్నారు, ఫ్రిజ్లు, స్టోరేజ్ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయా, కీటక నియంత్రణ వ్యవస్థ ఉందా, వంట సిబ్బంది ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande