మెదక్ జిల్లాలో అక్రమ రి ఫీలింగ్ గ్యాస్ దందా
అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్నారని సమాచారంతో మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారి నర్సింలు, స్థానిక పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
Gas refilling

మెదక్, 26 సెప్టెంబర్ (హి.స.)

అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్నారని సమాచారంతో మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారి నర్సింలు, స్థానిక పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామ శివారులో ఓ గోదాంలో జరిగిన ఈ దాడుల్లో అక్రమంగా రిఫీలింగ్ చేసి గోదాంలో దాచిన 296 సిలిండర్లను అధికారులు శనివారం సీజ్ చేశారు.ఎన్ని నిల్వ చేశారు.

అనుమతులు లేకుండా చేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒకే దగ్గర నిల్వ ఉంచడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన తీసుకుంటామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande