ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.. జగిత్యాల ఎమ్మెల్యే
జగిత్యాల నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా 2,000 ఇళ్లు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.
Mla


జగిత్యాల, 26 సెప్టెంబర్ (హి.స.

జగిత్యాల నియోజకవర్గానికి

ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా 2,000 ఇళ్లు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అర్హులైన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కేటాయించిన కోటా ప్రకారం, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, మొదటి విడతలో మంజూరైన 3,500 ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande