ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఊరుకొము .. మంత్రి ఉత్తమ్
ఎన్నికల ప్రక్రియలో 'రిఫరీ'పైనే అనుమానం కలిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.
మంత్రి ఉత్తం


హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)

ఎన్నికల ప్రక్రియలో 'రిఫరీ'పైనే అనుమానం కలిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

ఓటరు జాబితా సవరణలో వెలుగు చూసిన అంశాలపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం స్వతంత్రతే పునాది అని పేర్కొన్నారు.

ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమిస్తామన్నారు.

ఎన్నికల సంఘం స్వతంత్రత కోసం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయం కాదని ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వ ఆస్తినో, అధికార పార్టీ సొత్తో కాదని కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande