
అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో చికెనె ధరలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో చికెన్ ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి.
నాన్వెజ్ ప్రియులకు ఇది బ్యాడ్న్యూస్గా చెప్పవచ్చు. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. ఈ పెరుగుదలతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గత వారంలో కిలో చికెన్ రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.290 వరకు చేరుకున్నాయి
దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతున్న క్రమంలో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉల్లి ధరలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటే, ఇప్పుడు చికెన్, కోడి గ్రుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్లో కిలో స్కిన్ లెస్ ధర రూ.287గా ఉండగా.. డ్రస్స్డ్ చికెన్ రూ.254, రిటైల్ లైవ్ బర్డ్ రూ.164, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.137 వద్ద కొనసాగుతోంది. ఇక కరీంనగర్ జోన్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఏపీలో కూడా చికెన్ ధరలు పెరిగాయి. విజయవాడ జోన్లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.284 వద్ద కొనసాగుతుండగా.. డ్రస్స్డ్ చికెన్ ధర రూ.251గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.162, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.135 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV