ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించి పలు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.
Food PROCESSING


అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించి పలు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొత్త యూనిట్లు, విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. వీటి మొత్తం పెట్టుబడి విలువ రూ.2,350 కోట్లకు పైగా ఉంది.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా సంస్థ రూ.1,388 కోట్ల పెట్టుబడితో 40.50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ప్రత్యక్షంగా, మరో 3,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించవచ్చని అంచనా. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.592.22 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.

నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో ఎపిటోమ్ ఇండస్ట్రీస్ ఇండియా సంస్థ రూ.530.65 కోట్ల పెట్టుబడితో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కెల్లాగ్స్ ఇండియా తన మ్యూస్లీ, మల్టీగ్రెయిన్ చాకోస్ ప్లాంట్ విస్తరణకు రూ.211.70 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించింది.

ఇక నెల్లూరు జిల్లాలో సమగ్ర కోళ్ల పెంపకం, గుడ్ల ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా పెట్టుబడులు ప్రతిపాదించబడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande