గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ
రాయలసీమలో ఉద్యాన పంటల రంగాన్ని భారీగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటలకు విలువ ఆధారిత మార్కెట్లు కల్పించడం, ప్రాసెసి
AP Govt


అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)రాయలసీమలో ఉద్యాన పంటల రంగాన్ని భారీగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటలకు విలువ ఆధారిత మార్కెట్లు కల్పించడం, ప్రాసెసింగ్ మరియు ఎగుమతులను పెంచడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంటోంది.

రాయలసీమలోని ఎనిమిది జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను కలిపి మొత్తం 10 జిల్లాల్లో 201 క్లస్టర్ల ద్వారా సమగ్ర ఉద్యాన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం పెట్టుబడి లక్ష్యం సుమారు రూ.లక్ష కోట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రణాళికలో సాగునీటి రంగానికి సుమారు రూ.20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నాయని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పండ్ల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి శుద్ధి, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, ఎగుమతి వంటి అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ చేరే అవకాశం ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande