విజయవాడలో 24,057 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 24,057 కుటుంబాలకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందించనున్నారు.
Houses in ap


అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 24,057 కుటుంబాలకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందించనున్నారు. సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ‘పేదలకే పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు.

పాత ఎన్టీఆర్ హౌసింగ్ సైట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ద్వారా లబ్ధిదారుల ఆస్తులకు మరింత స్పష్టమైన హోదా లభించనుంది.

ప్రభుత్వ అంచనాల ప్రకారం క్రమబద్ధీకరణకు వస్తున్న భూమి విలువ సుమారు రూ.9,800 కోట్లు. ఒక్కో లబ్ధిదారు కుటుంబానికి దక్కే ఆస్తి విలువ సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. విజయవాడలో భూముల విలువ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇళ్ల స్థలాలపై స్పష్టమైన హక్కు పత్రాలు అందుకోవడం ద్వారా లబ్ధిదారులకు భవిష్యత్తులో ఆస్తి సంబంధిత లావాదేవీలు, వారసత్వ బదలాయింపులు వంటి అంశాల్లో ప్రయోజనం కలగవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande