మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం......అక్టోబర్ 1 వరకు దరఖాస్తులకు గడువు!
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం......అక్టోబర్ 1 వరకు దరఖాస్తులకు గడువు!
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం.


తిరుపతి, 27 సెప్టెంబర్ (హి.స.)2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి తిరుపతి జిల్లా గూడూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని A4 మద్యం దుకాణాల లైసెన్సుల మంజూరుకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు.

గూడూరు డివిజన్ పరిధిలో మొత్తం 98 A4 మద్యం దుకాణాలు ఉండగా, గత ఎక్సైజ్ పాలన ప్రకారం వాటి లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 79 మంది లైసెన్స్ దారులు నిర్ణీత గడువులోగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును చెల్లించి తమ లైసెన్సులను పునరుద్ధరించుకున్నారు.

అయితే, మిగిలిన 19 దుకాణాల యజమానులు తమ లైసెన్సులను పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆ 19 దుకాణాలకు కొత్త లైసెన్సులు మంజూరు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే, గూడూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 9 దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ T. లక్ష్మణ స్వామి మీడియాకు తెలిపారు.

ఈ దుకాణాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్ 2024 లోని రూల్-5 ప్రకారం లాటరీ విధానంలో, అంటే డ్రా ఆఫ్ లాట్స్ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించనున్నారు.

తిరుపతి జిల్లా గెజిట్ నోటిఫికేషన్ ను 24-09-2026వ తేదీన అధికారికంగా ప్రచురించారు. అదే రోజు నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

- దరఖాస్తులకు చివరి తేదీ: 01-10-2026 మధ్యాహ్నం 12 గంటల వరకు

- దరఖాస్తుల పరిశీలన తేదీ: 03-10-2026

- లాటరీ తేదీ: 05-10-2026 ఉదయం 08:00 గంటలకు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande