ఏపీని వీడని వానలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Rain


కర్నూలు, 27 సెప్టెంబర్ (హి.స.) ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటడంతో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

నేడు (ఆదివారం) పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ రోజు ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

కాగా.. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి స్వల్పంగా వరద పెరుగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. ఆదివారం నాడు వరద ప్రవాహం 8-9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం. అనంతరం క్రమంగా తగ్గవచ్చు. అత్యవసర సహాయం కోసం NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande