
తిరుమల, 27 సెప్టెంబర్ (హి.స.) తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఆదివారం ఉదయం అధికారుల వెల్లడించిన సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. వారాంతం కావడంతో పాటు, వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం అనుకూలించడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు.
భక్తుల తాకిడి పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు కాంప్లెక్స్ వెలుపల ఉన్న క్యూలైన్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. పెరుగుతున్న రద్దీని క్రమబద్ధీకరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యంత్రాంగం తగిన చర్యలు చేపడుతోంది.
వీకెండ్ కావడం, వర్షాలు తగ్గుముకం పట్టి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పెద్దఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు బ్రహ్మోత్సవాలు ముగిసిన మూడో రోజే తిరుమలలో మరో ఉత్సవం ప్రారంభించారు. పున్నమిని పురస్కరించుకుని పౌర్ణమి గరుడసేవను వైభవోపేతంగా నిర్వహించారు. శనివారం రాత్రి ఈ వేడుకలను నిర్వహించగా సాయంత్రం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు వేలాది మంది భక్తుల మధ్య ఉత్సవం కన్నుల పండుగలా సాగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV