
అమరావతి , 28 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో క్లైమేట్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. సెప్టెంబర్ 28నుంచి 30 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడక్కడా దంచికొట్టే వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
కేవలం వానలే కాదు, ఉరుములు, మెరుపులు, ఇంకా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్తో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు అలర్ట్ చేశాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఉండనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం (28-09-26) విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలియజేసింది . మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV