ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా రాజీనామా చేయాలి.... కాంగ్రెస్ నేతల డిమాండ్
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా రాజీనామా చేయాలని మదనపల్లెలో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా రాజీనామా చేయాలని.......కలెక్టర్కు వినతిపత్రం!


మదనపల్లె, 28 సెప్టెంబర్ (హి.స.)ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) అంశంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సోమవారం ఉదయం మదనపల్లెలో జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెడుతూ ఓటు అనే వజ్రాయుధాన్ని దొడ్డిదారిన ఉపయోగించుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande