రేపు ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
రేపు ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
సీఎం చంద్రబాబు


నెల్లూరు, 28 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు 29వ తేదీన ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు 29వ తేదీన ఉదయం 10:20 గంటలకు విజయవాడ స్వరాజ్ మైదాన్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగే 'మిషన్ కర్మయోగి' ప్రాంతీయ వర్క్షాప్కు హాజరవుతారు.

29వ తేదీన మధ్యాహ్నం 1:15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:35 గంటలకు కాకోల్లువారిపల్లిలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలిస్తారు.

అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి 'శ్రమదానం' కార్యక్రమానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:05 నుంచి సాయంత్రం 5:20 వరకు రామాపురంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు రామాపురం నుంచి హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమై.. 6:30 గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande