
అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ నగరానికి చెందిన భక్తుడు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి రూ.76 లక్షలతో వజ్రాలు పొదిగిన స్వర్ణకిరీటం తయారు చేయించారు.
దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ఈ కిరీటాన్ని బహూకరించనున్నారు. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ స్నేహితుడైన ఓ భక్తుడు కొన్ని రోజుల క్రితం అమ్మవారికి కిరీటం చేయించాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఛైర్మన్ ఈ విషయాన్ని దేవస్థానం ఈవో, వైదిక కమిటీ సభ్యులతో చర్చించగా వారు అంగీకరించారు. నిర్దిష్ట కొలతలతో రూ.50 లక్షల అంచనాలతో కిరీటం తయారీ ప్రారంభించినా చివరకు రూ.76 లక్షలకు పూర్తయిందని ఛైర్మన్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ