
తిరుమల, 28 సెప్టెంబర్ (హి.స.)నేడు తిరుమలకు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. తమ కుటుంబ సమేతంగా కొండపైకి చేరుకోనున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
తిరుమలకు చేరుకున్న అనంతరం మంత్రి లోకేష్ టీటీడీ నిర్వహించే రాత్రి విడిది వద్ద బస చేస్తారు. పర్యటన నేపథ్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఎలాంటి వేడుకలు, భద్రతాపరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలో అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి.
సుప్రభాత సేవలో మంత్రి పర్యటనలో భాగంగా ఎల్లుండి తెల్లవారుజామున తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాత సేవలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. వేకువజామున శ్రీవారి ఆలయ తలుపులు తెరిచే పవిత్రమైన సమయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు సమర్పించనున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందడమే కాకుండా, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించనున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయనుండగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేయనున్నారు.
దర్శన కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి లోకేష్ తిరుమలలోని పలు అభివృద్ది పనులు, భక్తుల సౌకర్యాలపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. భక్తులకు కల్పిస్తున్న వసతులు, క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV