అక్టోబర్ 12 నంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి
తిరుమల


తిరుమల, 28 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20వరకు వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.దీన్ని గురించి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఒక ప్రకటనలో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేండ్లకోసారీ అధికమాసం వచ్చినప్పుడు, కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలతోపాటు దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అక్టోబరు 11న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనున్నది.

ఉత్సవాల సందర్భంగా స్వామివారు రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వివిధ వాహనాలపై మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నా రు. అక్టోబరు 12న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవంతో మొదలై రాత్రి పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. అనంతరం వరుసగా చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మలయప్పస్వామి ఊరేగుతారు.

వాహన సేవలు ఇలా

12.10.2026 - బంగారు తిరుచ్చి - పెద్దశేషవాహనం

13.10.2026 - చిన్నశేష వాహనం - హంసవాహనం

14.10.2026 - సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం

15.10.2026 - కల్పవృక్ష వాహనం - సర్వభూపాల వాహనం

16.10.2026 - మోహినీ అవతారం -

గరుడవాహనం (సాయంత్రం 6.30 గంటలకు)

17.10.2026 - హనుమంత వాహనం - పుష్పక విమానం

18.10.2026 - సూర్యప్రభ వాహనం - చంద్రప్రభ వాహనం

19.10.2026 - స్వర్ణరథం - అశ్వవాహనం

20.10.2026 - చక్రస్నానం(ఉదయం 6 గంటలకు)

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande