యూఎస్లోని మిల్వాకీలో జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం.. పాల్గొన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్!
యూఎస్లోని మిల్వాకీలో జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం.. పాల్గొన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్!
Piyush Goyal


న్యూఢిల్లీ, 30 సెప్టెంబర్ (హి.స.)

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి ఆహ్వానం మేరకు ఆయన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో జరుగుతున్న జీ20 వాణిజ్య మంత్రుల (G20 Trade Ministers' Meeting) సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 1 వరకు అక్కడ అందుబాటులో ఉండనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి వివిధ దేశాల నుంచి వాణిజ్య మంత్రులు హాజరయ్యారు.

ఈ పర్యటనలో భాగంగా పియూష్ గోయల్ జీ20 సదస్సుతో పాటు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు మరియు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగాల్లో వాణిజ్య అవకాశాలను మెరుగుపరచడంపై ఆయన తన సమర్ధవంతమైన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

అలాగే, అమెరికా అధికారులతో జరిగే చర్చల్లో భాగంగా ఇండియా-యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) పురోగతిపై సమీక్ష జరపనున్నారు. మిల్వాకీతో పాటు చికాగోలోనూ పర్యటించనున్న ఆయన, అక్కడ పలువురు ప్రముఖ అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలు, తయారీ రంగం, రిటైల్, టెక్నాలజీ రంగాల సీఈఓలతో సమావేశం కానున్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అద్భుతమైన అవకాశాలను వివరిస్తూ, తయారీ రంగానికి భారత్ వేదికగా మారుతున్న తీరును ఆయన అంతర్జాతీయ వేదికపై హైలైట్ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande