అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలి....బెల్జియం, భరత్ నిర్ణయం
వాణిజ్యం, రక్షణ, విలువైన ఖనిజాలు, శుద్ధ ఇంధనం, సాంకేతికతల రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని బెల్జియం, భరత్ నిర్ణయించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM modi


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.)వాణిజ్యం, రక్షణ, విలువైన ఖనిజాలు, శుద్ధ ఇంధనం, సాంకేతికతల రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని బెల్జియం, భరత్ నిర్ణయించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్తో గురువారం చర్చలు జరిపిన తర్వాత ఈ మేరకు ఆయనొక ప్రకటన చేశారు.

భారత్-బెల్జియం మధ్య రక్షణ, భద్రత రంగాల్లో సహకారం ఇరు దేశాల మొత్తం సంబంధాలకు మూల స్తంభంగా నిలుస్తుందని అన్నారు.

ప్రతిభను ప్రోత్సహించేలా వలసల పరంగానూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటాం అని మోదీ వివరించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఘర్షణలకు చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ముగింపు పలకాలని ఇరువురు ఆకాంక్షించినట్లు చెప్పారు.

మరియు ఇరు దేశాలూ రక్షణ రంగ పరిశ్రమలపై మరో 10 ఒప్పందాలు కుదిరాయి. బెల్జియం సైన్యం అందించే సాంకేతికతతో మన దేశంలో రాకెట్లు తయారు చేయడం దీనిలో ఒకటి. కీలకమైన సైనిక హార్డ్వేర్ను పాకిస్థాన్కు సరఫరా చేయబోమని బెల్జియం స్పష్టం చేసినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande