లోకల్ ట్రైన్లో కృష్ణాష్టమి వేడుకలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బద్లాపూర్-థానే లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళలు కృష్ణాష్టమి సందర్భంగా ఆ వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు.
Railway


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.)మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బద్లాపూర్-థానే లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళలు కృష్ణాష్టమి సందర్భంగా ఆ వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. మహిళా కోచ్ను బెలూన్స్, ఇతర వస్తువులతో అందంగా డెకరేట్ చేశారు. రైలు పైభాగంలో ఉండే హ్యాండిల్కు ఉట్టిని కూడా వేలాడదీశారు. డ్యాన్సులు చేయడంతో పాటు ఉట్టిని పగులగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande