శ్రీశైలంలో ఆకట్టుకుంటున్న నృత్య ప్రదర్శనలు
శ్రీశైల దేవస్థానంలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కడప ఎస్. నటరాజ డాన్సు అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది.
/classical-dance-performances-charm-devotees-at-srisailam-temple-


శ్రీశైలం, 04 సెప్టెంబర్ (హి.స.)శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) శ్రీ ఎస్. నటరాజ డాన్సు అకాడమీ, కడప వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నది.

ఈ కార్యక్రమములో గణపతి తాండవం, మూషికవాహన, వినాయకకౌత్వం, శివతాండవం, శంకరా శశిధరా, శివశివశంకరా, జయ జయ నటరాజ తదితర గీతాలకు, అష్టకాలకు మాదలస, గౌతమి, అమ్ములు తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు. కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande