
హైదరాబాద్, 04 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు(శుక్రవారం) ఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని మంత్రి కలిశారు.
సమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్గఢ్ ఎన్వోసీ ఇవ్వాల్సిందిగా కోరారు. బ్యారేజీ ముంపు పరిధిలోని భూములు, ఇళ్లకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా హామీ ఇచ్చారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం NOC ఇస్తే బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సమక్క-సారక్క బ్యారేజీ ద్వారా మొత్తం 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రామప్ప-పాకాల లింక్ కెనాల్ కింద 30 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించాలని మంత్రి ప్రతిపాదించారు.
ఇక, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా, గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారు. ఛత్తీస్గఢ్ నుంచి NOC లేకపోవడంతో పాటు అంతర్రాష్ట్ర అంశాల పరిశీలన పెండింగ్లో ఉంది. బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం కోసం ఛత్తీస్గఢ్కు ఇప్పటికే రూ.9.883 కోట్లు చెల్లించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్