సీజ్ చేసిన సిగరెట్ల విక్రయం.. ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్
స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో భాకరాపేట అటవీ క్షేత్రాధికారి ఎన్. వెంకటరమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
suspended


తిరుపతి, 04 సెప్టెంబర్ (హి.స.) స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో భాకరాపేట అటవీ క్షేత్రాధికారి ఎన్. వెంకటరమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి అవినీతికి పాల్పడ్డారని ఎఫ్ఆర్వోపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు జీవకోనకు చెందిన జి.మునిగోపాల్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

తిరుపతి నుంచి రాయచోటికి తరలిస్తున్న రూ.యాబై లక్షల విలువైన సిగరెట్లను సీజ్ చేసిన ఎఫ్ఆర్ఓ వెంకటరమణ.. ఆపై వాటిని వేరే వారికి విక్రయించినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఆర్వోపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande