
కాణిపాకం, 04 సెప్టెంబర్ (హి.స.) శ్రీకాణిపాకం దేవస్థానం 2026 వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి దేవస్థానం పెద్దల నుండి
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందింది.
విజయవాడ లోని క్యాంప్ కార్యాలయలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ , దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ , మరియు చైర్మన్ మణి నాయుడు ఆహ్వానించారు.
తరువాత స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం వేద ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV