రాజకీయాల్లో తీవ్ర విషాదం.. జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం
జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణంతో ఆ రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
/jharkhand-minister-sudivya-kumar-passes-away-suddenly-


హర్సింగరాయ్డీహ్, 06 సెప్టెంబర్ (హి.స.) జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి సుదివ్య కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున హర్సింగరాయ్డీహ్లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సుదివ్య కుమార్ను గిరిడీహ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన తుది శ్వాస విడిచారు. మంత్రి మృతి వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖసంద్రంలో మునిగిపోయారు. వార్త వ్యాపించడంతో జేఎంఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ధన్బాద్ ఎస్ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande