ఢిల్లీలో భారీ వర్షం... రెడ్ అలర్ట్ జారీ
నేడు ఉదయం దేశ రాజధాని ఢిల్లీ తోపాటు పరిసర ప్రాంతాలలో కుండపోత వర్షం ముంచెత్తింది.
Rain


ఢిల్లీ , 05 సెప్టెంబర్ (హి.స.)నేడు ఉదయం దేశ రాజధాని ఢిల్లీ తోపాటు పరిసర ప్రాంతాలలో కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమవడంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్ ' జారీ చేసింది. వర్షాలవల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగడంతోపాటు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల ప్రభావంతో ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. అయితే రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 7 నుంచి కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande