పాకిస్తాన్కు గూఢచర్యం కేసులో 15 మందిపై చార్జిషీట్ దాఖలు
ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన కేసులో 15 మంది నిందితులపై శనివారం చార్జిషీటు దాఖలు చేసింది.
NIA


ఢిల్లీ , 05 సెప్టెంబర్ (హి.స.)ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన కేసులో 15 మంది నిందితులపై

శనివారం చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజ్ వాల్మీకి, శివ వాల్మీకి, రితికా గ్యాంగ్వార్, సమీర్ @షూటర్, దుర్గేష్ నిషాద్, నౌషద్, గగన్ కుమార్, వివేక్, శివరాజ్, మీరా ఠాకూర్, షేన్ ఇరామ్ @ మహక్ అనే 15 మందిని నిందితులుగా పేర్కొంది.

అలాగే, ఐదుగురు జువైనల్ నిందితులకు సంబంధించిన నివేదికను గత మే 18న, జువైనల్ జస్టిస్ బోర్డుకు సమర్పించారు. ఈ ఐదుగురు మైనర్స్ కావడం వల్ల వీరికి విధించే శిక్షలు వంటి అంశాల్లో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు భంగం కలిగించే పని చేశారు. మిగతా నిందితులపై కూడా విచారణ కొనసాగుతోంది. వారిపై నిపుణుల అభిప్రాయలు తీసుకున్న అనంతరం తదుపరి విచారణ జరిపి, పూర్తిస్థాయి చార్జిషీటు దాఖలు చేస్తారు. మరో ఘటనలో పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న ఏడుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande