Custom Heading

బద్వేలు ఉప ఎన్నికకు 15మంది అభ్యర్థులు బరిలో
,ఆంధ్రప్రదేశ్ 13 అక్టోబర్ (హిం.స)బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనుంది. కాగా, నేడు నామినేషన్ల
బద్వేలు ఉప ఎన్నికకు 15మంది అభ్యర్థులు బరిలో


,ఆంధ్రప్రదేశ్ 13 అక్టోబర్ (హిం.స)బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనుంది. కాగా, నేడు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బద్వేలు బరిలో 15 మంది అభ్యర్థులు మిగిలారు. బద్వేలు బరిలో మొత్తం 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా 9 మంది అభ్యర్థులను అధికారులు తిరస్కరించారు. 18 మంది మిగలగా, వారిలో ముగ్గురు నేడు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో బద్వేలు బరిలో 15 మంది మిగిలినట్టయింది. ప్రధానంగా వైసీపీ తరఫున డాక్టర్ దాసరి పద్మ, బీజేపీ తరఫున పనతల సురేశ్ పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను బరిలో దించరాదని నిర్ణయించడం తెలిసిందే.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande