Custom Heading

అమీర్ ఖాన్ సియట్ ప్రకటనపై వివాదం
బెంగళూరు, 22 అక్టోబర్ (హిం.స) : బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనం
అమీర్ ఖాన్ సియట్ ప్రకటనపై వివాదం


బెంగళూరు, 22 అక్టోబర్ (హిం.స) : బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.అమీర్ ఖాన్ సియట్ లిమిటెడ్ ప్రచార ప్రకటనలో ఇటీవల నటించారు. దీపావళి పండుగ సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దంటూ అమీర్ ఖాన్ టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ వాణిజ్య ప్రకటనలో అమీర్ ఖాన్ కోరారు. ఈ వాణిజ్య ప్రకటనలో అమీర్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అనంతకుమార్ ఆరోపించారు. సియట్ ప్రకటనలో అమీర్ ఖాన్ చేసిన ప్రకటన హిందువుల్లో అశాంతి సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. సియట్ కంపెనీ హిందువుల సెంటిమెంటును గౌరవిస్తుందని ఆశిస్తున్నానని అనంతకుమార్ సియట్ ఎండీ, సీఈవో వర్ధన్ గోయెంకాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమాచార్/నాగరాజ్

 rajesh pande