పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 400 సీట్లు ఖాయం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
కరీంనగర్ ఏప్రిల్ 25 (హిం.స) పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400 పైచిలుకు సీట్లు ఖాయమని గు
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 400 సీట్లు ఖాయం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్


కరీంనగర్ ఏప్రిల్ 25 (హిం.స)

పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400 పైచిలుకు సీట్లు ఖాయమని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలియజేశారు. గురువారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఇప్పటికే బీజేపీకి ఒక ఎంపీ స్థానం వచ్చిందని, 400కు పైగా స్థానాలను గెలిచి ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అయిపోయిందన్నారు.

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో 17సీట్లు బీజేపీ గెలవబోతుందన్నారు. బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ టీం కు కెప్టెన్ లేడని, తమ కెప్టెన్ నరేంద్ర మోడీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలన్నారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని, మోదీజీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారన్నారు. మోదీని ఆశీర్వదిస్తే తెలంగాణ సంక్షేమాన్ని చూసుకుంటారన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం పెరిగిందన్నారు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీ కే దక్కుతుందన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande