బీహార్ లో భారీ అగ్ని ప్రమాదం
బీహార్‌ 25 ఏప్రిల్ (హిం.స)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో
బీహార్ లో భారీ అగ్ని ప్రమాదం


బీహార్‌ 25 ఏప్రిల్ (హిం.స)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం అందుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పలువురిని రక్షించారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande