అద్భుతం, అనిర్వచనీయం టీఆర్ఎస్ ప్రస్థానం
, 24 అక్టోబర్ (హిం.స) టీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, దాదాపు ఏడేండ్ల ప్రభుత్వ ప్రస్థానం తల
అద్భుతం, అనిర్వచనీయం టీఆర్ఎస్ ప్రస్థానం


, 24 అక్టోబర్ (హిం.స) టీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, దాదాపు ఏడేండ్ల ప్రభుత్వ ప్రస్థానం తలుచుకుంటే అద్భుతం, అనిర్వచనీయం అనిపించడంతో పాటు ఆవేదన, సంతోషం కలుగుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్లు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు, ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అంశం లేవనెత్తడం అంటేనే అది తప్పు, కేవలం రాజకీయం కోసమే అన్న స్థితిని కల్పించడంలో ఆనాటి పాలకులు విజయవంతమైనారు. ఆ పరిస్థితుల నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చి, వారి మనసులను గెలిచి ఉద్యమంలో మమేకం చేయించడం ఓ పెద్ద సవాల్. అట్టి సవాల్ ను మేం గెల్చినం.

తెలంగాణ నినాదం అంటేనే ఒక అపనమ్మకం, దానిని ఉచ్చరించడం నేరం. ఆ పదం మాట్లాడాలి అంటేనే ఒక భయానక, అభద్రతాభావ పరిస్థితి కల్పించడంలో ఆ నాటి ఆంధ్రా మీడియా పై చేయి సాధించి ఉన్నది.

ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో ఉద్యమాన్ని నడిపించి భారత పార్లమెంటును ఒప్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో అనేక

రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఏడేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ దేశంలోని మిగతా 27 రాష్ట్రాలలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి గారు పేర్కొన్నారు.

తెలంగాణ అమరుల సాక్షిగా ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర అభివృద్దిలో ముందుకు సాగుతున్నామని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఇవ్వని హామీలనూ అమలు పరుస్తూ, పార్టీలకు అతీతంగా, దళారుల ప్రమేయం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ టీఅర్ఎస్ కే ఉంటాయని మంత్రి అన్నారు.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande