అణుబాంబుల సంఖ్యను చెప్పిన అమెరికా
అమెరికా , 6 అక్టోబర్ (హిం.స)అమెరికా ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణు బాంబుల సంఖ్యను వెల్లడించింది. గత నాలు
అణుబాంబుల సంఖ్యను చెప్పిన అమెరికా


అమెరికా , 6 అక్టోబర్ (హిం.స)అమెరికా ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణు బాంబుల సంఖ్యను వెల్లడించింది. గత నాలుగేళ్లలో ఆ సంఖ్యను ప్రకటించడం ఇదే తొలిసారి. అణ్వాయుధాల డేటాను వెల్లడించేందుకు నాలుగేళ్ల క్రితం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా వద్ద 3,750 అణ్వాయుధాలు ఉన్నట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. 2019తో పోలిస్తే ఆ సంఖ్య 55 తక్కువే. ఇక 2017తో పోలిస్తే 72 తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 1967లో రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన తర్వాత అమెరికా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకున్నది. ఒకప్పుడు అమెరికా వద్ద 31,255 అణుబాంబులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా పడిపోయింది. రష్యాతో ఆయుధ నియంత్రణపై చర్చలు నిర్వహించినున్న నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం అణుబాంబుల సంఖ్యను ప్రకటించింది. నిరాయుధీకరణలో పారదర్శకత అవసరమని ప్రభుత్వం వెల్లడించింది.

స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ ఏడాది జనవరి వరకు అమెరికా వద్ద 5,550, రష్యా వద్ద 6255, చైనా వద్ద 350, బ్రిటన్ వద్ద 225, ఫ్రాన్స్ 290 అణుబాంబులు ఉన్నాయి. ఇండియా, పాకిస్థాన్, ఇజ్రాయిల్, నార్త్ కొరియా వద్ద మొత్తం కలిపి 460 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నట్లు ఆ ఇన్స్టిట్యూట్ తెలిపింది.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande