యుఎన్ఓ, అమెరికా సూచనలు బే ఖాతర్.. ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి ప్రారంభం
న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (హిం.స)ఇజ్రాయిల్ అన్నంత పనీ చేసింది. ఇరాన్ పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో
యుఎన్ఓ, అమెరికా సూచనలు బే ఖాతర్.. ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి ప్రారంభం


న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (హిం.స)ఇజ్రాయిల్ అన్నంత పనీ చేసింది. ఇరాన్ పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి, అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పైక్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగాఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కూడా వెల్లడించింది.

ఇస్ఫాహాన్లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్ఫోర్స్ బేస్లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ 'ఫార్స్' పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టాయని పేర్కొంది. అయితే, మీడియా కథనాలను అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా తమ గగనతలాన్ని మూసివేసింది.

టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది.

గత శనివారం ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది. సిరియాలోని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్పై వందల డ్రోన్లు, క్షిపణులతో ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande