ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు..
టెల్ అవీవ్: ఏప్రిల్ 21 (హిం.స) ''ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( IDF)''కు చెందిన ''నెట్టా యెహుదా'' బె
ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు..


టెల్ అవీవ్: ఏప్రిల్ 21 (హిం.స)

''ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( IDF)''కు చెందిన ''నెట్టా యెహుదా'' బెటాలియన్పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్బ్యాంక్లోని పాలస్తీనీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ యాక్సియోస్ వార్తాసంస్థ ఓ కథనం ప్రచురించింది.

నెట్టా యెహుదాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పాలస్తీనా వాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2022లో 78 ఏళ్ల పాలస్తీనా-అమెరికన్ ఒమర్ అసద్ మృతికి వీరే కారణమన్న ఆరోపణలున్నాయి. 2022 డిసెంబరులో వెస్ట్బ్యాంక్ నుంచి ఈ దళాన్ని ఇజ్రాయెల్ తరలించింది. కానీ, ప్రభుత్వం దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. నాటి నుంచి ఈ దళం ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెటాలియన్పై పలు వివాదాలున్నాయి.

అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదం కాదని అన్నారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande