ద్వీపదేశం మాల్దీవులు పార్లమెంటు కు నేడు ఎన్నికలు.. అధ్యక్షుడు ముయిజ్జు పాలనపై ప్రజా తీర్పు.
మాలే: ఏప్రిల్ 21 (హిం.స) ద్వీపదేశం మాల్దీవులో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి ఆ దేశ అధ్
ద్వీపదేశం మాల్దీవులు పార్లమెంటు కు నేడు ఎన్నికలు.. అధ్యక్షుడు ముయిజ్జు పాలనపై ప్రజా తీర్పు.


మాలే: ఏప్రిల్ 21 (హిం.స) ద్వీపదేశం మాల్దీవులో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టాక భారత వ్యతిరేక వైఖరిని అనుసరించారు. ఈ క్రమంలో అక్కడున్న మన బలగాలను వెనక్కి పంపించారు. మరియు చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు కీలక కాంట్రాక్టులను కట్టబెట్టారు. ఈ చర్యలను ప్రస్తుతం ఆ దేశ పార్లమెంటు సభ్యులు మాత్రం ముయిజ్జు తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. అతడి చర్యలును అడ్డుకోవడానికి మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ కలిసి పనిచేస్తున్నారు.ముయిజ్జు సీనియర్ సహాయకుడు ఓ వార్తా సంస్థతో

మాట్లాడుతూ “ఈ ఎన్నికల్లో భౌగోళిక రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత సైన్యాన్ని

వెనక్కి పంపిస్తానని హామీ ఇచ్చి ముయిజ్జు అధికారంలోకి వచ్చారు. ఆ దిశగా ప్రయత్నించారు. కానీ, పార్లమెంటు

ఆయనకు సహకరించడం లేదు. ఆయన ఎంపిక చేసిన మంత్రులకు వ్యతిరేకంగా ఓటేసి వారి పదవులు పోయేలా చేసింది” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ముయిజ్జు పార్టీ కూడా ఈ ఎన్నికలను తమ పాలనకు కఠిన పరీక్షగా భావిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దాదాపు 2,85,000 మంది ఆదివారం నాడు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. కాగా వీటి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande