Custom Heading

సోమ్ నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వసం చేశాం
ఆఫ్ఘనిస్తాన్ , 6 అక్టోబర్ (హిం.స)ఆఫ్ఘనిస్థాన్లోని ప్రముఖ సోమ్నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్ల
సోమ్ నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వసం చేశాం


ఆఫ్ఘనిస్తాన్ , 6 అక్టోబర్ (హిం.స)ఆఫ్ఘనిస్థాన్లోని ప్రముఖ సోమ్నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆ స్థానంలో మహ్మద్ ఘజినీ దర్గాను పునర్నిర్మిస్తామని చెప్పారు. తాలిబన్లకు చెందిన అనస్ హక్కానీ మంగళవారం ఈ ఆలయానికి వెళ్లాడు. అక్కడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు రాత్రి ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఇవాళ మేము పదో శతాబ్దపు ముస్లిం వారియర్ అయిన మహ్మద్ ఘజ్నవీ దర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో పటిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు. అక్కడి సోమ్నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేశాము అని ఆ ట్వీట్లో అనస్ చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న సోమ్నాథ్ దేవాలయ పునర్నిర్మాణం 1951లో పూర్తయింది. అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరగగా.. ఆయన మరణానంతరం ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీ సోమ్నాథ్ మందిర్ ట్రస్ట్కు ప్రధాని మోదీ చైర్మన్గా ఉన్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి

 rajesh pande