Custom Heading

2023లో భారీ మెజార్టీతో గెలుస్తాం: అమిత్ షా
డిల్లీ 06 డిసెంబర్ (హిం.స )రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిం
2023లో భారీ మెజార్టీతో గెలుస్తాం: అమిత్ షా


డిల్లీ 06 డిసెంబర్ (హిం.స )రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ విమర్శలు గుప్పించారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుందని వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. గ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ఎప్పుడూ ప్రయత్నించదని, కానీ 2023లో మూడింట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా అన్నారు.

“తన ప్రభుత్వం పడిపోతుందనే భయం అతనికి నిరంతరం ఉంటుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరు? మీ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టడం లేదు...మీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎప్పటికీ పడగొట్టదు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా 2023లో మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని జైపూర్లో జరిగిన బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతల సమావేశంలో షా అన్నారు.

హిందూస్థాన్ సమాచార్/నాగరాజ్


 rajesh pande