ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా?బండి సంజయ్
ఎల్లారెడ్డి, 18 సెప్టెంబర్ (హిం.స)ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణ కు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోప
ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా?బండి సంజయ్


ఎల్లారెడ్డి, 18 సెప్టెంబర్ (హిం.స)ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణ కు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సవాల్ విసిరారు. ‘‘ నేను కేసీఆర్ కు సవాల్ విసిరుతున్నా....ఇద్దరం కలిసి ప్రధాని వద్దకు వెళదాం. నిధుల విషయంలో తెలంగాణకు కేంద్రం ఏమీ ఇస్తలేదని నిరూపించు. అక్కడికక్కడే నా పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ కేంద్రమే నిధులిస్తుందని నిరూపిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’’అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.... ‘‘కొందరు పనిలేని కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నరు. క్రికెట్ భాషలో చెప్పాలంటే.... వీళ్లకు టీఆర్ఎస్ కెప్టెన్ అయితే, ఎంఐఎం వైస్ కెప్టెన్. కాంగ్రెస్ నేతలు ఎక్స్ ట్రా ప్లేయర్ల లాంటి వాళ్లు. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, ఎంఐఎం. గతంలో పోటీ చేసింది వీళ్లే. కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ లోకి వలస వెళ్లేది ఆ పార్టీ వాళ్లే’’అని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 22వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన సభలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ది అంతా సినిమాలో చూపించి ‘బీదర్ ఇసుక వ్యవహారమే’. పైకి చెప్పేదొకటి...లోపల జరిగేదొకటి. ఢిల్లీకి పోయి చెప్పేదొకటి...జరిగేదొకటి. అంటూ విమర్శించారు. రాష్ట్రానికి వేల కంపెనీలు వచ్చాయని, పక్క రాష్ట్రంలో పుడితే బాగుండదని ఇతర రాష్ట్రాల ప్రజలంతా అనుకుంటున్నారని చెబుతున్న కేసీఆర్ కు నేను చెప్పేదొక్కటే....నిజంగా వేల కంపెనీలు వస్తే మీకు నేనే తోమాల సేవ చేస్తా....లేకుంటే ఎత్తుకెళ్లి పక్క రాష్ట్రంలో పడేసి వస్తా. తెలంగాణ ప్రజల పీడ వదిలిపోతుంది అని అన్నారు.

•నిన్న ఒక్కరోజే 2.5 కోట్ల మంది వ్యాక్సిన్ వేయడం ప్రపంచంలోనే రికార్డు. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. తెలంగాణ సమర యోధులను గుర్తిస్తం. పక్కా పెన్షన్ ఇస్తామని అమిత్ షా చెప్పారనీ, అమిత్ షా నిర్మల్ కు వచ్చి మతవిద్వేషాలు రగిలిస్తున్నారని టీఆర్ఎస్ నేతలంటున్నరు. నేనంటున్న కేసీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రాం జయంతి, వర్దంతిలకు రాడు. నిన్న సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవానికి ఎందుకు బయటకు రాలేదు? నీకెందుకంత అహంకారం? కనీసం ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేదంటే నువ్వు నెంబర్ వన్ తెలంగాణ ద్రోహివి. బీజేపీకి అభివ్రుద్ది ఎంత ముఖ్యమో ఆత్మగౌరవం అంతే ముఖ్యం. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ సభ జరిపినం అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

కేసీఆర్ రోజుకో మాట చెబుతూ రైతులను మోసం చేస్తుండు. ప్రతి గింజ కొంటాం. పొలాలవద్దకు వచ్చి ధాన్యం కొని బ్యాంకులో డబ్బు జమచేస్తమని, కేంద్రం ఏమీ చేస్తలేదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని మాట మారుస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తుండు. రైతులకు బియ్యానికి సంబంధమేంది? రైతులు వడ్లు మాత్రమే అమ్మేది. బియ్యంతో రైస్ మిల్లులకు, కేసీఆర్ కు మాత్రమే సంబంధం? గతంలో పాస్ పోర్టు బ్రోకర్ పనిచేసినోడు కేసీఆర్. కమీషన్ల లెక్కలు బాగా తెలుసు. అందుకే మిల్లర్లతో కమీషన్ల లెక్క కుదరక ఇలాంటి మాటలు మాట్లాడుతుండు అని అన్నారు.

బియ్యం కొనొద్దని ఎవరొద్దంటున్నరు. ఇక్కడి బియ్యం కొనడానికి ఆయనకేం బాధ. మనం కర్నూలు బియ్యం కొంటున్నం. ఇక్కడి బియ్యాన్ని ఎందుకు కొనరు. ఎగుమతి చేయరు? కనీసం ఢిల్లీలో జరిగే ట్రేడర్స్ మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదు. ఏమైనా అంటే కేసీఆర్ చాలా బిజీ అంటున్నడు. కానీ ఏ పనిచేస్తున్నడో చెప్పడు. కనీసం షెడ్యూల్ కూడా విడుదల చేయని సీఎం ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే ఉన్నరు. ఎప్పుడు చూసినా ఫాంహౌజ్ లో పడుకుంటడు. జనాల్ని కలవడు అని ఎద్దేవా చేశారు.

ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్. ఇంటికో ఉద్యోగమన్నడు ఇచ్చిండా? ఇక్కడున్న వాళ్లకు ఎంతమందికి ఉద్యోగాలొచ్చినయ్, నిరుద్యోగ భ్రుతి ఇచ్చిండ్రా? (ఒక్కరికీ రాలేదని యువత చేతులెత్తారు?) ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ.లక్ష అప్పు ఉంది. ఈ డబ్బంతా ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఇంకో రెండేళ్లయితే కేసీఆర్ మూటాముళ్లె సర్దుకుని ఇంటికి పోతారు. ఇప్పుడు మళ్లా సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు కోసం రూ.6,500 కోట్లు అప్పు తెచ్చిండు. కేంద్రం రాష్ట్రానికి 2.91 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే...మోడీ కట్టించే ఇండ్లు సరిపోవు... అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానన్నడు. కానీ కట్టివ్వలేదు. కేంద్రం ఇచ్చిన ఇండ్లను ఎందుకు కట్టివ్వలేదు? ఎన్నికలొస్తే ఒకరిద్దరికి ఇండ్లు ఇచ్చి గెలిపిస్తే అందరికీ ఇండ్లిస్తానని కథలు చెప్పి మళ్లీ మోసం చేస్తడు..ప్రజలారా...జాగ్రత్త. అంటూ తన ప్రసంగంలో చెప్పారు.

ఎల్లారెడ్డి ప్రజలు ఏం పాపం? ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా లేదు. అంతెందుకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇక్కడున్న పోలీసులకు కూడా జీతాలు రాలేదు. ప్రమోషన్లు కూడా లేవు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తనంటడు. కానీ ఇవ్వడు. ఫ్రీ వ్యాక్సిన్ గురించి చెప్పడు. ఆయన మాత్రం 90 ఎంఎల్ వేస్తడని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్రమైతే.... సిగ్గులేకుండా కేసీఆర్ ఫొటోలు పెట్టుకుంటుండు. చివరకు కేంద్రం ఇచ్చే డబ్బులతో స్వచ్ఛ భారత్ టాయిలెట్లు కట్టిస్తే....ఆ టాయిలెట్ గోడలపైనా కేసీఆర్ ఫొటోలే పెట్టుకుంటుండటం సిగ్గు చేటు. కేసీఆర్ ఫాంహౌజ్ లో ఐసీయూ ఉంటది. కేసీఆర్ కుక్కకు రోగమొస్తే డాక్టర్లు వస్తరు. పేదోడికి రోగమొస్తే పట్టించుకునే దిక్కు లేదు అని అన్నారు.

ఎల్లారెడ్డిలో కేంద్రం ఇచ్చిన నిధులు చాలా ఉన్నాయి. పేదల ఉపాధి కూలీ కోసం రూ.217.71 కోట్లు, అభివ్రుద్ది 94.42 కోట్లు, ఆర్దిక సంఘం గ్రామాల 72 కోట్లు భి మొక్కల 26.46 కోట్ల, 12.59 కోట్లు టాయిలెంట్లు, 2.19 మున్సిపల్, గ్రామీణ రహదారుల కోసం 260 కోట్లు, చెత్త 40 లక్షలు, 1.71 కోట్లు ఇవి గాకుండా వైకుంఠధామానికి రూ.11.13,700, రైతు వేదికలకు రూ.10 లక్షలుసహా పల్లె ప్రక్రుతి వనాలకు, నర్సరీల కోసం కేంద్రమే పూర్తిగా నిధులిస్తోంది....ఇవి తప్పయితే మా పై కేసులు పెట్టొచ్చు. నేనడుగుతున్న ఈ ప్రాంత నేతలను....కేసీఆర్ మెడలు వచ్చి ఈ ప్రాంత నేతలు ఏమైనా నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి డబ్బులు కేంద్రమే ఇస్తోంది. ఏమీ ఇస్తలేదనుకున్నవ్ కదా...నేను కేసీఆర్ కు సవాల్ విసిరుతున్నా....ఇద్దరం కలిసి ప్రధాని వద్దకు వెళదాం. ఏమీ ఇస్తలేదని నిరూపించు. నా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ కేంద్రమే నిధులిస్తుందని నిరూపిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? ఢిల్లీకి పోయి వంగి వంగి దండాలు పెడుతున్న కేసీఆర్...బయటకొచ్చి సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నడు అంటూ కేసీఆర్ కు సవాలు విసిరారు బండి సంజయ్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర ఎరువులు, రసాయన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు....ఈ సభకు హాజరయ్యారు

హిందూస్తాన్ సమాచార్ నాగరాజరావు సంతోషలక్ష్మి


 rajesh pande