అంతర్జాతీయ పోటీలకు సహాయ సహకారం అందిస్తామన్న ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం
తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 23 ( హింస) మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షే
అంతర్జాతీయ పోటీలకు సహాయ సహకారం అందిస్తామన్న ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం


తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 23 ( హింస)

మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కాలేజ్ విద్యార్థి సాయి కిరణ్ జాతీయ స్థాయి క్రీడలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇటీవల హర్యానా లో జరిగిన స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ఒలంపిక్స్ లో షాట్ పుట్ విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుని తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేశాడు.

వికారాబాద్ లోని బాలుర జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయికిరణ్ ఈ నెల 18 నుంచి 21 వరకు హర్యానా లో జరిగిన స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ఒలం పిక్స్ లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. దాంతోపాటు మలేషియాలో జరగబోయే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సొంతం చేసుకున్నాడు. షాట్ పుట్ విభాగంలో

బంగారు పతకం సాధించి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న సాయికిరణ్ ను బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్ బుర్రా వెంకటేశం శాలువాతో సత్కరించారు.

అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి అవసరమైన సహాయం సొసైటీ నుంచి అందిస్తామన్నారు. చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్నారు. మలేషియా లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీలోనూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. తాను రచించిన అమెజాన్ బెస్ట్ సెల్లర్ బుక్ ''గెలుపు పిలుపు" కిరణ్ కు అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వికారాబాద్ బీసీ వెల్ఫేర్ గురుకుల కాలేజ్ ప్రిన్సిపల్ ప్రకాష్ కోయల్ కార్ , కోచ్ మహిపాల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, సంయుక్త కార్యదర్శి రమణారెడ్డి, ఉప కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్ని సాయికిరణ్ ను అభినందించారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande