ఈనెల 10వ తేదీన రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేణుక చౌదరి
తెలంగాణ: ఖమ్మం; ఏప్రిల్ 8 (హిం.స) తెలంగాణ ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్
ఈనెల 10వ తేదీన రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేణుక చౌదరి


తెలంగాణ: ఖమ్మం; ఏప్రిల్ 8 (హిం.స)

తెలంగాణ ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన రేణుకాచౌదరి 10వ తేదీన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11గంటలకు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆమె ముహూర్తం నిర్ణయించుకున్నారు. రాజ్యసభలోని రూం నెంబర్ 100 ఫస్ట్ ఫ్లోర్ లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మంలోని ఆమె ముఖ్య అనుచరులు ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార


 rajesh pande