కమలా హారిస్ ను భారత పర్యటనకు ఆహ్వానించిన మోదీ
అమెరికా , 24 సెప్టెంబర్ (హిం.స)అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్
కమలా హారిస్ ను భారత పర్యటనకు ఆహ్వానించిన మోదీ


అమెరికా , 24 సెప్టెంబర్ (హిం.స)అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, అమెరికా సహజ భాగస్వాములని చెప్పారు. అధ్యక్షుడు బైడెన్, కమలా నేతృత్వంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉధృతి సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమలా హారిస్ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande