కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస) నగరంలోని మియాపూర్ మయూరీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య ప
కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస)

నగరంలోని మియాపూర్ మయూరీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేవలం తెలంగాణలో కంటివెలుగు కొనసాగుతున్నదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వెల్లడించారు. కేంద్రాలలో ఉచితంగా అందిస్తున్న కంటి వెలుగు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande