ఖట్మండులో మళ్లీ భూకంపం…తీవ్రత ఎంతంటే…
ఖట్మండు, 24 అక్టోబర్ (హిం.స) నేపాల్లోని ఖాట్మండులో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది
ఖట్మండులో మళ్లీ భూకంపం…తీవ్రత ఎంతంటే…


ఖట్మండు, 24 అక్టోబర్ (హిం.స)

నేపాల్లోని ఖాట్మండులో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది.

మంగళవారం తెల్లవారుజామున నేపాల్లోని ఖాట్మండులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో నమోదైంది. నేపాల్ దేశంలోని ఖాట్మండు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం వివరాలు తెలియలేదు. ఖట్మండులో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఆదివారం నేపాల్లో 6.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్లో భూకంప కేంద్రం నమోదైంది.

హిందూస్తాన్ సమాచార్, సంధ్య


 rajesh pande