ఇజ్రాయెల్ కొత్త రహస్య ఆయుధాలు…స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు
గాజా, 28 అక్టోబర్ (హిం.స) రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహ
New Secret Weapon


గాజా, 28 అక్టోబర్ (హిం.స)

రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహస్య ఆయుధాలను రంగంలోకి దించింది.

ఇజ్రాయెల్ కొత్తగా ప్రయోగించిన సీక్రెట్ ఆయుధాలు స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు బాగా పనిచేశాయని తాజా దాడుల్లో తేలింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న వందల కిలోమీటర్ల టన్నెళ్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ కొత్తగా రహస్యంగా స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు ప్రయోగించింది.

గాజా స్ట్రిప్ లోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ ఈ రహస్య ఆయుధాలతో మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ టన్నెళ్లపై వైమానిక స్పాంజ్ బాంబు దాడులు చేసింది. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ తమ భూబలగాల కార్యకలాపాలను విస్తరించిందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande