గాజాలో ఆకలిరాజ్యం,తాగడానికి మంచినీళ్లు కరువు
గాజా, 6 నవంబర్ (హిం.స) యుద్ధ కల్లోలిత గాజా క్రమంగా ఆకలిరాజ్యంగా మారుతోంది. సలాహ్ అల్-దీన్ వద్ద ఇజ్
గాజాలో ఆకలిరాజ్యం,తాగడానికి మంచినీళ్లు కూడా లేవు


గాజా, 6 నవంబర్ (హిం.స)

యుద్ధ కల్లోలిత గాజా క్రమంగా ఆకలిరాజ్యంగా మారుతోంది. సలాహ్ అల్-దీన్ వద్ద ఇజ్రాయెల్ సేనలు మోహరించడంతో.. ఉత్తర-దక్షిణ గాజాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా ఈజిప్ట్ నుంచి రఫా సరిహద్దు మీదుగా వస్తున్న మానవతాసాయం గాజాకు చేరడం లేదు. దీంతో.. గాజా ఉత్తరాది వారికి పూటకు ఒక రొట్టె దొరకడం కూడా గగనంగా మారుతోంది.

‘‘గాజా మొత్తమ్మీద ఒక సగటు పౌరుడు రోజుకు రెండు రొట్టెముక్కలు తిని జీవిస్తున్నాడు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవు’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిస్థితులు మరో వారంపదిరోజులు ఇలాగే కొనసాగితే.. ఆకలిచావులు తప్పవని గాజాలోని ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

హిందూస్తాన్ సమాచార్, సంధ్య


 rajesh pande