కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పన్నుల ద్వారానే నడుస్తాయి .....ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శాసనసభలో మాట్లాడారు. కేంద్ర,
....


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస)

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శాసనసభలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పన్నుల ద్వారానే నడుస్తాయని, దేశానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నారు. ధరణి సమస్యలను ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం ఇవ్వకుండా పేదల నుంచి లాక్కుంటుందని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెరిగాయి అన్నారు… రాష్ట్రం పెట్రోల్పై పన్ను వేయదా? అని ఆయన అన్నారు. సెలూన్లకు ఇస్తామన్న వంద యూనిట్లు ఉచితంగా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ జీతాలు మొదటి వారంలో రావడం లేదని, గ్రామ సర్పంచ్ లకు, కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేవారు. స్పీకర్ను అడ్డు పెట్టుకొని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande