సినీ నటి మాధురీ దీక్షిత్ కుటుంబంలో విషాదం
ముంబయి 12 మార్చ్ (హిం.స) ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం తర్వాత బాలీవుడ్ నుండి మరో బ్యాడ్ న
సినీ నటి మాధురీ దీక్షిత్ కుటుంబంలో విషాదం


ముంబయి 12 మార్చ్ (హిం.స) ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణం తర్వాత బాలీవుడ్ నుండి మరో బ్యాడ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ హిందీ సినీ నటి మాధురీ దీక్షిత్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

మాధురి తల్లి స్నేహలతా దేశ్ముఖ్ కన్నుమూశారు. తల్లి మరణంతో మాధురి కుటుంబం పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని వెల్లడించారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

హిందుస్థాన్ సమాచార /రాజీవ్


 rajesh pande