మంచు వారి ఇంట మరో సందడి.. తండ్రిగా ప్రమోషన్ పొందిన మనోజ్.
తెలంగాణ వినోదం ఏప్రిల్ 13 (హిం.స)మంచు వారి ఇంట మరోసారి సందడి మొదలైంది. మంచు మనోజ్ ఈ రోజు తండ్రిగా ప్
మంచు వారి ఇంట మరో సందడి.. తండ్రిగా ప్రమోషన్ పొందిన మనోజ్.


తెలంగాణ వినోదం ఏప్రిల్ 13 (హిం.స)మంచు వారి ఇంట మరోసారి సందడి మొదలైంది.

మంచు మనోజ్ ఈ రోజు తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య భూమా మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి, మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఆ దేవతల అశీస్సులతో మా ఇంటికి చిన్ని దేవత వచ్చిందని, ఈ సందర్భంగా పాపకు ముద్దు పేరుగా ఫస్ట్ లెటర్స్ వచ్చేలా ఎం ఎం పులి.. అని పెట్టామని ప్రకటించారు.

ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటిస్తూ రెండు యానిమేటెడ్ ఫొటోలను జత చేసి పోస్టు చేయగా మనోజ్ దానిని రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande