తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడుల టెన్షన్
తెలంగాణ : హైదరాబాద్ : జూన్ 7( హింస ) తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడుల టెన్షన్


తెలంగాణ : హైదరాబాద్ : జూన్ 7( హింస )

తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ మొదలైంది. నిన్న 8 గంటల పాటు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ ల స్వాధీనం చేసుకున్నారు. నేడు వీసీ ని విచారించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ కూడా ఏసీబీ, విజిలెన్స్ బృందం తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. యూనివర్సిటీలో రెండేళ్లలో చేసిన ఖర్చులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగం విచారణ చేయాలని ఈసీ పిర్యాదు చేయడంతో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande